చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
MBNR: కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్లో కార్పొరేటర్ చిన్న ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కార్పొరేటర్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.