'వనమహోత్సవ లక్ష్యసాధనకు కృషి చేయాలి'

WGL: వన మహోత్సవ లక్ష్య సాధనకు అధికారులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశించారు. వన మహోత్సవంపై సోమవారం శాఖల సమీక్ష నిర్వహించారు. 2025-26లో జిల్లాలో 31 లక్షల 4 వేల 272 మొక్కలు నాటే లక్ష్యానికి భాగంగా ఇప్పటివరకు 10.87 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు.