మంత్రి లోకేశ్‌ను కలిసిన చదలవాడ

పల్నాడు: నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మంత్రి నారా లోకేశ్‌ను చదలవాడ అరవింద్ బాబు కోరారు. ఆదివారం సాయంత్రం లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో తాగునీరు, రోడ్లు ఇతర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.