గనులశాఖ కార్యాలయానికి శంకుస్థాపన

గనులశాఖ కార్యాలయానికి శంకుస్థాపన

ప్రకాశం: ఒంగోలులో ఆదివారం గనులు భూగర్భ శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రులు కొల్లు రవీంద్ర, డోల బాల వీరాంజనేయ స్వామి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర పాల్గొన్నారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో మంత్రులతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.