బోర్లంలో మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు
NZB: బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ పోలింగ్ బూత్ ను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు ఓటర్లను స్వాగతం పలికేందుకు పోలింగ్ బూతును అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.