ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన

ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన

VKB: పరిగి పట్టణ కేంద్రంలో రూ.27 కోట్లతో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రికి మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రెండేళ్లలో స్పెషాలిటీ సేవలతో ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు. బెడ్లు, మిషన్ల సంఖ్యను పెంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకుంటామని హమీ ఇచ్చారు. ఎనిమిది మెడికల్, 16 నర్సింగ్ కళాశాలలతో 400 అదనపు సీట్లు వస్తున్నాయన్నారు.