భక్తులతో కిటకిటలాడుతున్న గోదావరి నది

భక్తులతో కిటకిటలాడుతున్న గోదావరి నది

NRML: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సోన్ గోదావరి నదికి భక్తుల తాకిడి పెరిగింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు గోదావరి స్నానాలను ఆచరించడం సాంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా నిర్మల్ పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు గోదావరి నది ఒడ్డున దీపారాధన చేసి పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. మాదాపూర్, సోన్ గోదావరికి భక్తుల రద్ది పెరిగింది.