మాజీ మంత్రి జోగి రమేష్‌ను పరామర్శించిన శ్రీకాంత్ రెడ్డి
అన్నమయ్య: ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జరిగిన దాడి ఘటనపై కుటుంబ సభ్యులతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. జోగి రమేష్ సోదరుడు రాము, కుమారుడు రాజీవ్‌ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశమై పరిస్థితులపై చర్చించారు.