శీతల్ దేవికి వైఎస్ జగన్ అభినందనలు
ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టుకు ఎంపికైన భారత పారా ఆర్చర్ శీతల్ దేవికి ఏపీ మాజీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయమని పేర్కొన్నారు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చని శీతల్ నిరూపించిందని చెప్పారు. ఆసియా కప్‌లో పాల్గొననున్న ఆమెకు 'ఆల్‌ది బెస్ట్' చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.