గుమ్మడి గెడ్డ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు

గుమ్మడి గెడ్డ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు

PPM: కొమరాడ మండలం మాదలంగి గ్రామ సమీపంలో ఉన్న గుమ్మడి గెడ్డ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది గురువారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు ఎవరైనా పొలాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు. ఏనుగుల గుంపు ఈ రాత్రికి పాలెం గ్రామం వైపు వచ్చే అవకాశం ఉందన్నారు.