అరసవల్లిలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా 'వార్షిక కళ్యాణ మహోత్సవాలు' నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భద్రాజి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులందరూ హాజరై ఉత్సవాల్లో పాల్గొని శ్రీస్వామివారి కళ్యాణమూర్తులను దర్శించాలన్నారు. ఈ నెల 12వ తేదీతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు.