ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలకు నిప్పు
TPT: చంద్రగిరి(M) రంగంపేటలోని యాదవ వీధిలో దారుణం చోటుచేసుకుంది. శేషాద్రి అనే వ్యక్తి ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆటో పూర్తిగా దగ్ధమైంది. అలాగే రాజశేఖర్ ట్రాక్టర్ టైర్లకూ నిప్పు పెట్టారు. గమనించిన కుటుంబ సభ్యులు మంటలను ఆర్పివేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కారులో వచ్చిన వారే నిప్పు పెట్టినట్లు సమాచారం. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.