VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు
అన్నమయ్య: మదనపల్లె - పీలేరు బైపాస్ రోడ్డులో వాల్మీకిపురం వద్ద గురువారం ఒక స్కూటీ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో స్కూటీ నడుపుతున్న వ్యక్తి కింద పడిపోవడంతో తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.