VIDEO: మున్సిపల్ కమిషనర్ పై గ్రామస్తుల ఆగ్రహం

MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి కోమటిపల్లి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివాదం నెలకొంది. గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ దేవేందర్ ఉదయం ఏడు గంటల 30 నిమిషాలకు జాతీయ జెండా ఎగరవేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు లేకుండా ఎలా జెండా ఎగురవేశారని కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు .