కోతుల బెడదతో ప్రజల బెంబేలు
MDK: తూప్రాన్ మండలంలోని నాగులపల్లి గ్రామస్థులు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ జనాభా కంటే అధికంగా కోతులు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి పైకప్పులపై తిరుగుతూ ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను దోచుకెళ్తున్నాయి. అంతేకాకుండా చిన్న పిల్లలు కనబడితే వారిపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.