తల్లి మృతి.. కొడుకుపై కేసు నమోదు

WGL: కొడుకు కొట్టడంతో తల్లి మృతి చెందిన ఘటనపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. ఆయన కథనం మేరకు పర్వతగిరి మండలం గుడిబండ తండాలో భూక్య రంగమ్మను పెద్ద కొడుకు భూక్య రవి కొట్టి గాయపరచడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త దేవుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.