'మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'
SRCL: పట్టణ మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పేర్కొన్నారు. గుడిచెరువు అభివృద్ది పనులు, చెరువులోకి మురికినీరు చేరకుండా మూలవాగు వరకు చేపట్టిన అండర్ గ్రౌండ్ పైపులైన్ పనులను శుక్రవారం పరిశీలించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. గుడి చెరువు కలుషితం కాకుండా చూడటమే తమ ప్రథమ ప్రాధాన్యత అన్నారు. వైస్ ఛైర్మన్ నరాల శేఖర్ పాల్గొన్నారు.