గ్రంథాలయ నిర్మాణానికి స్థల పరిశీలన

NZB: సాలూర మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ నిర్మాణానికి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. నూతన మండలాల్లో రూ. 30 లక్షలతో భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆయన తెలిపారు. యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రోత్సహించడం కోసం ఈ గ్రంథాలయ నిర్మాణాన్ని చేపడుతున్నామని వివరించారు.