గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు

గుర్తుతెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: పుంగనూరు మండలం ఈడిగపల్లె చెక్ పోస్ట్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తికి ఫిట్స్ వచ్చాయి. దీంతో అతను రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని వివరాలు తెలియాల్సి ఉంది.