ప్రత్యేక అలంకరణలో ఆంజనేయ స్వామి..!
అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో వెలసిన శ్రీ వరాల ఆంజనేయ స్వామి విశేష అలంకరణలతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి వేకువజామునే అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్ప మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇవాళ స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తీర్థ,ప్రసాదాలు స్వీకరించారు.