తొక్కిసలాటపై సుప్రీం ప్యానెల్ ఇన్‌స్పెక్షన్
కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు ఇన్‌స్పెక్షన్ కొనసాగునుంది. సీబీఐ దర్యాప్తును ఈ ప్యానెల్ సమగ్రంగా పర్యవేక్షించనుంది. కరూర్ జిల్లా అధికారులను ఆరా తీయనుంది. గత నెల 12న టీవీకే చీఫ్ విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు.