ఉద్యోగం పేరిట ఘరానా మోసం..

ADB: ఉద్యోగం పేరిట ఆశ చూపి రూ.98,600లను సైబర్ నేరగాళ్లు కాజేసిన ఘటన వెలుగు చూసింది. ఎస్సై కె.నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మహాలక్ష్మీవాడకు చెందిన బీటెక్ విద్యార్థి ముబైల్‌కి ఈ నెల 4న ‘వీఐపీ లింక్’ అనే మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న సమాచారం ప్రకారం రూ.3 వేలు చెల్లించడంతో సైబర్ నేరగాళ్లు హ్యక్ చేసి స్వాధీనం చేసుకున్నారు.