బీరు బాటిల్‌తో దాడి

బీరు బాటిల్‌తో దాడి

తిరుపతిలోని చింతలచేను ట్రావెల్ బస్సుల వద్ద గొడవ జరిగింది. వేదాంతపురానికి చెందిన పెర్నండోజ్ జాన్సన్ బస్సు ఓనర్. అతని దగ్గర పవన్ కళ్యాణ్, హరిబాబు పనిచేస్తున్నారు. వారి మధ్య గొడవలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఉన్నాడనే నెపంతో పెర్నండోజ్ పై హరి, అతని స్నేహితుడు మోహన్ బీరు బాటిల్ పగలగొట్టి ఛాతిపై పొడిచారు. ఇద్దరిపై పోలీసులు  హత్యాయత్నం కేసు నమోదు చేశారు.