ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. డ్రైవర్‌కు గాయాలు
KMM: వేంసూరు మండలం మర్లపాడు సెంటర్ వద్ద శనివారం RTC బస్సు, లారీ ఢీకొన్నాయి. సత్తుపల్లి డిపో నుంచి తిరువూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో తక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఉండటంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే, డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.