తోటపల్లి గూడూరులో నలుగురి అరెస్ట్

తోటపల్లి గూడూరులో నలుగురి అరెస్ట్

నెల్లూరు: వ్యవసాయ మోటర్ల చోరీ ముఠాను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపారు. తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్‌లో ఆమె మాట్లాడుతూ.. మోటార్ చోరీలకు పాల్పడిన నలుగురిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 25 మోటార్‌లు, రూ. 35,000 విలువచేసే ఇనుప పైపులు స్వాధీనం చేసుకున్నామన్నారు. యువత వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.