వేధింపులు తట్టుకోలేక.. గర్భిణి ఆత్మహత్య
BHPL: గణపురం(M)బుద్ధారంలో ఇవాళ దారుణ విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలానికి చెందిన మౌనిక (23) రెండేళ్ల క్రితం ఇక్కడి యువకుడు ప్రశాంత్‌తో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త కుటుంబ సభ్యులు నిరంతరం వేధిస్తుండటంతో, 7 నెలల గర్భిణిగా ఉన్న మౌనిక వేధింపులు తట్టుకోలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.