నగరంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
HNK: జిల్లాలో మరమ్మతు పనుల కారణంగా సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని NPDCL DE సాంబరెడ్డి తెలిపారు. KU సబ్‌స్టేషన్ పరిధిలో మ. 3 నుంచి 5 గం వరకు, సోమిడి సబ్‌స్టేషన్ పరిధిలో ఉ. 9 నుంచి 11 గం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.