బాధిత కుటుంబానికి సంతాపం తెలిపిన ఎమ్మెల్యే

NLR: కావలి పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన గోపసాని ప్రసాద్ మృతికి సంతాపం తెలిపేందుకు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మంగళవారం ప్రసాద్ నివాసానికి వెళ్లి, ఆయన భౌతిక కాయాన్ని దర్శించి, పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక పాల్గొన్నారు.