చెరువు గండి పూడ్చేందుకు ఏకమైన గ్రామస్థులు..!

SDPT: చెరువుకు గండి పడటంతో గ్రామస్థులందరూ ఏకమై యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిండిన చెరువుకు రాత్రివేళ గండి పడివది. దీంతో బుంగ ద్వారా నీరు భారీగా బయటకు వెళ్లింది. సాగునీటి నష్టం, ఇతర చెరువులకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో, గ్రామస్థులు ట్రాక్టర్లు, జేసీబీలతో మట్టివేస్తూ బుంగను పూడ్చేప్రయత్నం చేస్తున్నారు.