VIDEO: జలపాతం సమీపంలో పేలిన మందు పాతర

VIDEO: జలపాతం సమీపంలో పేలిన మందు పాతర

MLG: వెంకటాపురం(మ) వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యాల ధార జలపాతం సమీపంలో శుక్రవారం మందు పాతర పేలింది. ఈ ప్రమాదంలో ఇప్పగూడెం గ్రామానికి చెందిన బొగ్గుల కృష్ణ మూర్తి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెదురు బొంగుల కోసం అడవికి వెళ్ళిన నలుగురు గ్రామస్తులు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.