'ఈనెల 8లోపు దరఖాస్తు ఫారములు అందజేయాలి'

'ఈనెల 8లోపు దరఖాస్తు ఫారములు అందజేయాలి'

MNCL: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారములు ఈనెల 8లోపు మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ప్రకటనలో సూచించారు. 1995 మందిలో 1524 మంది మాత్రమే తమ దరఖాస్తులను కార్యాలయంలో సమర్పించారన్నారు. దరఖాస్తు ఫారాలను బ్యాంకులకు పంపవలసి ఉన్నందున త్వరగా అందజేయాలన్నారు.