తోటి మిత్రుడు కుటుంబాలు 41 వేలు ఆర్థిక సాయం

తోటి మిత్రుడు కుటుంబాలు 41 వేలు ఆర్థిక సాయం

GDWL: మల్దకల్ మండలంలో పదో తరగతి పూర్వ విద్యార్థులు తమ మిత్రప్రేమను చాటుకున్నారు. ఇటీవల అకాల మరణం చెందిన తమ మిత్రుడు శేషన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు వారంతా ఒక్కటయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శేషన్న కుటుంబానికి ఆదివారం రూ. 41,000 నగదును అందజేశారు. మిత్రుడు లేకపోయినా, అతని కుటుంబం అనాధ కాకూడదనే ఉద్దేశంతో చేసిన సాయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.