ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

కోనసీమ: ఉచిత ఇసుక పాలసీ విధానం ద్వారా ఇసుక తవ్వకాలు, రవాణా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన ఇసుక లావాదేవీలు, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు.