PGRSలో అర్జీల స్వీకరణ
AKP: కసింకోట మండల పరిషత్తు కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో ముందుగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అర్జీల సేకరణపై సూచనలు సలహాలు ఇచ్చామన్నారు. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.