VIDEO: పోలీస్ స్టేషన్ ఎదుట వైసీపీ నిరసన
GNTR: వైసీపీ దళిత నేతలపై దాడి చేసిన టీడీపీ వర్గీయులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు పొన్నూరు పీఎస్ ఎదుట ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల అండతో దాడులకు తెగబడితే సహించేది లేదన్నారు. నాయకులు చెప్పారని దాడులు చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు.