రైతుకు సాయం చేసిన జెర్రిగొడ్డు పాము!
ఓ రైతుకు జెర్రిగొడ్డు పాము సాయం చేసింది. చేనులో ఎలుకలు చేసిన కన్నాల వల్ల.. ఎంత నీరు పారించినా.. అది భూమిలోకి ఇంకిపోతుంది. ఆ సమయంలో రైతుకు జెర్రిగొడ్డు పాము కనిపించింది. అది విషపూరితం కాదని.. దానిని చంపకుండా వదిలేశాడు. ఆ పాము ఎలుకల్ని తింటూ.. దానికి తెలియకుండానే పంట పండించడంలో సాయం చేసింది. దీంతో ఆ రైతు ఆనందం వ్యక్తం చేశాడు.