పీఆర్టీయు నాయకులు ముందస్తు అరెస్ట్

KMM: సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబరు 1న చలో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద మహాధర్నాకు PRTU సత్తుపల్లి మండల నాయకులు తరలి వెళ్తుండగా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సత్తుపల్లి మండల అధ్యక్షులు బి.సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మధుసూధనాచారి, రాష్ట్ర బాధ్యులు రవీందర్ రెడ్డి, రియాజుద్ధీన్, డి.ఏసురత్నం అరెస్టయిన వారిలో ఉన్నారు.