రైతులకు సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ

NLR: ఇందుకూరుపేట పట్టణంలోని పశు వైద్య అధికారి కార్యాలయంలో బుధవారం రైతులకు సబ్సిడీపై పశువుల దాణ పంపిణీ చేశారు. దాదాపుగా 7 టన్నులు పశువుల దాణా రైతులకు పంపిణీ చేయడం జరిగిందని ప్రాంతీయ పశు వైద్యశాల డాక్టర్ మురళీకృష్ణ తెలియజేశారు. ఈ పశువుల దాణాను పాడి పశువులకు వేయడం వలన పాల దిగుబడి పెరిగి పశువులు ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు.