డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం: ఏపీ జేఏసీ

AP: రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు కోరారు. రాబోయే 3 నెలల్లో తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ రెండేళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామన్నారు.