' గోవింద నాయక్ సేవలు మరువలేనివి'
MNCL: ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే దివంగత గోవింద నాయక్ చేసిన సేవలు మరువలేనివని మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే గోవింద నాయక్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో మంగళవారం దండేపల్లి మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆయన కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు.