'పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

'పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది'

BHPL: ప్రజా ప్రభుత్వం పల్లెల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన శాయంపేట మండలంలో పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ.20లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, రూ.3లక్షలతో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే, వనమహోత్సవంలో మొక్కలు నాటారు.