'నిమజ్జనానికి బయలుదేరిన భారీ గణనాథుడు'

'నిమజ్జనానికి బయలుదేరిన భారీ గణనాథుడు'

JGL: రాయికల్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన భారీ గణనాథుడు మంగళవారం నిమజ్జనానికి బయలుదేరాడు. ఈ సందర్భంగా కరెంట్ తీగలకు విగ్రహం తాకే అవకాశం ఉండటంతో.. అత్యవసరమైన చోట విద్యుత సరఫరాను నిలిపివేయనున్నట్లు రాయికల్ పట్టణ విద్యుత్ అధికారి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.