VIDEO: బెల్ట్ షాపులు వద్దంటూ నిరసనకు దిగిన ప్రజలు

ప్రకాశం: చీమకుర్తి మండలం మంచికలపాడు గ్రామంలో ఇవాళ ప్రజలు మద్యం బెల్ట్ షాపుల వద్దంటూ నిరసన తెలిపారు. గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. మద్యం సేవించి ఇబ్బందులు కలిగిస్తున్నారని, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు.