ఆన్‌లైన్ కొనుగోళ్లు.. అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ
NGKL: ఆర్మీ అధికారుల పేరుతో సెకండ్ హ్యాండ్ వస్తువుల ప్రకటనలు ఇచ్చి మోసం చేసే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ సూచించారు. తక్కువ ధరకే వస్తువులని నమ్మి ముందస్తుగా డబ్బులు పంపవద్దన్నారు. అలాగే అనుమానిత QR కోడ్‌లను స్కాన్ చేయవద్దని ఆయన హెచ్చరించారు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని తెలిపారు.