వెయిట్ లిఫ్టింగ్ పోటీలో సత్తా చాటిన కుప్పం యువకుడు

వెయిట్ లిఫ్టింగ్ పోటీలో సత్తా చాటిన కుప్పం యువకుడు

CTR: బెంగళూరులో జరిగిన బిగ్గెస్ట్ ఎవర్ బిగినర్స్ అండ్ ఓపెన్ స్టేట్ కాంపిటీషన్‌లో కుప్పం యువకుడు అర్పత్ ఖాన్ సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించాడు. అర్పత్ ఖాన్‌ను కుప్పం రెస్కో ఛైర్మన్ ప్రతాప్ అభినందించారు. యువత అన్ని రంగాలలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. గోల్డ్ మెడల్‌ సాధించి కుప్పానికి మంచి పేరు తెచ్చిన ఖాన్‌ను పలువురు అభినందించారు.