పట్టపగలే వెన్నెల కాంతులు

ప్రకాశం: గిద్దలూరులోని ఎబీఎంపాలెంలో కొన్ని ప్రాంతాల్లో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్నాయి. పగలు కూడా వీధి దీపాలు వెలుగుతుండటంతో ప్రజాధనం వృథా అవుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నగర పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, పగటిపూట వీధి దీపాలు వెలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.