పాముకాటుతో మహిళ మృతి
KMM: బోనకల్ మండలంలోని పెద్ద బీరవల్లిలో బుధవారం పాముకాటుకు గురై పంది వీరలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. కూలి పనుల నిమిత్తం పొలంలో మొక్కజొన్నలు కోస్తుండగా తాచుపాము కరిచింది. దీంతో ఆమె స్పృహ కోల్పోగా, గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే మార్గంలోనే పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది.