14న అంబేద్కర్ జయంతి వేడుకలు
PPM: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి మహోత్సవాలను ఏప్రిల్ 14న జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రభుత్వ హాస్పిటల్ జంక్షన్ (మెయిన్ రోడ్) వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పిస్తారని తెలిపారు.