ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ఆధునీకరణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

VSP: భీమిలి జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) కాలేజీలో రూ.13.65 కోట్లతో ప్రతిపాదించిన ఆధునీకరణ పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. కేంద్ర విద్యా శాఖ అనుబంధమైన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో జిల్లా విద్యా శిక్షణ సంస్థల అభివృద్ధికి రూ.43.22 కోట్లు మంజూరు చేసిందన్నారు.