VIDEO: పుష్పాలు, తులసీదళాల మధ్య శ్రీనివాసుడు
శ్రీకాకుళం: జిల్లాలోని గుజరాతిపేట తిరుమలగిరిపై వెలసిన శ్రీ నారాయణ తిరుమల ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం విశేష పూజలను చేశారు. ఈ సందర్భంగా నారాయణుడికి ఆలయ ప్రధాన అర్చకులు, పండితుల వివిధ రకాల పువ్వులతో అలంకరించి, తులసి దళాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు మహావిష్ణువు పాదాల వద్ద దీపాలు వెలిగించి, విష్ణు సహస్రనామాలతో అర్చనలు చేయించారు.